ఉత్తమ ఉపాధ్యాయుడు :-కంచనపల్లి ద్వారకనాథ్--చరవాణి:9985295605

 రంగరాజపురం పాఠశాలలో కృష్ణశర్మ ,పట్టాభి చదువుకుంటుండేవాళ్లు . ఇద్దరు చదువులో  చురుగ్గా వుండడమే కాక కృష్ణశర్మపాటలు,పద్యాలు  పాఠశాలలో  జరిగే కార్యక్రమాల్లో పాడి అందరినీ ఆకట్టుకోవడమేకాక ఎన్నో  బహుమతులు   తెచ్చుకునేవాడు .     , అలాగే పట్టాభి పాఠశాల లో పెట్టే వ్యాసాల పోటీలు కానీ ,  ఏదైనా అంశం ఇచ్చి మాట్లాడమంటే తన వాక్చాతుర్యం  తో ఆకట్టుకోవడమే కాక ,  తనకిచ్చిన అంశం అందరికీ  అర్ధమయ్యే టట్లు ఎన్నో విషయాలు చెప్పేవాడు . ఎన్నో బహుమతులు తెచ్చుకునేవాడు .    
   యిద్దరు మంచి  స్నేహితులు గా వుంటూ బాగా చదువుకుని పెద్దై ఇద్దరువాళ్ళ అభిరుచుల మేరకు వేరు వేరు  పాఠశాలల్లో  ఉపాధ్యాయులుగ  స్థిరపడ్డారు .
      తరగతిలో కృష్ణశర్మ   పిల్లలకు    పాఠాలు చెపుతున్నప్పుడు    కొంతమంది సరిగ్గా వినే వాళ్ళు కాదు  . మరికొందరు   విన్నా అనేక సందేహాలు ,ప్రశ్నలు వాళ్ళకు వచ్చేవి . ఉపాధ్యాయుల గదిలో  కృష్ణ శర్మ  ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలు వెళ్ళి  వాటిని నివృత్తి చేసుకుంటుండేవారు . మరికొందరు పాఠాలు గుడ్డిగా  కంఠస్తం   చేసి పరీక్షలు వ్రాసేవారు . ఈ సమస్య ప్రతిసారి కృష్ణ శర్మకు  ఎదురవ్వడంతో ఆలోచనలో పడ్డాడు . దానికి తోడు తోటి ఉపాధ్యాయులు గూడా కృష్ణ శర్మ తో మీరు ఎంతో  ఉన్నతమైన చదువులు చదువుకుని అన్నిటిలో ప్రథమ శ్రేణి లో    ఉత్తీర్ణులైనారు . కానీ మీరు ఖాళీగా వున్నసమయంలో గూడా పిల్లలు ఎన్నో  సందేహాలు తీర్చు కోవడానికి మీ వద్దకువస్తున్నారు  . దీనికి కారణం ఏమిటి ? అని అడగడం మొదలు పెట్టారు .  కృష్ణ శర్మ గూడా నేను అదే ఆలోచి స్తున్నాను అని  చెప్పడంతో బడి  ఆఖరు గంట మ్రోగడం తో అందరూ వెళ్ళిపోయారు . 
   కృష్ణ శర్మ బడికి సెలవు పెట్టి  తన బంధువుల ఇంట్లో శుభ కార్యానికి   పక్క ఊరికి వెళ్ళి  వస్తూ  దారిలో పట్టాభి ని కలిసి వెళ్లాలని   బడిలో అడుగు    పెట్టాడు  . పట్టాభి తరగతిలో పాఠం చెపుతున్నాడు . పిల్లలు  నిశబ్ధం గా, శ్రద్దగా వింటూండడం చూసి పక్కగా నిలబడిపోయాడు . అది గమనిoచని పట్టాభి  పిల్లలకు   పాఠం చెప్పే టప్పుడు అర్థమవ్వడానికి  ఉదాహరణలు , సామెతలు  , పొడుపు కథలు లాంటివి ఎన్నో    చెప్పడం ,అడిగిన దానికి పిల్లలు సమాధానాలు వెంటనే   చెప్పడం గమనించాడు . పిల్లలు  శ్రద్దగా పాఠాలు వినాలన్న , అర్థం చేసుకోవాలన్న ఎలాచెప్పాలో అన్న విషయం కృష్ణ  శర్మ కు అర్థమైంది . ఇంతలో గంట మోగడంతో   పట్టాభి తరగతి   బయటికి వచ్చి కృష్ణ  శర్మ ను చూసి సంతోషంతో పలకరించాడు. ఇద్దరు  మాట్లాడు కుంటూ ఎన్నో విషయాలు పట్టాభి ని  అడిగి తెలుసుకున్నాడు .    
 మర్నాడు  తరగతిలో  పాఠం చెప్పడంలో ఎంతో మార్పు కనపడడం తో పిల్లలు శ్రద్దగా  పాఠాలు వినడం , ప్రశ్నలు , సందేహాలు  తీర్చుకోవడం  క్రమేణా తగ్గిపోయి పిల్లలందరూ   చక్కగా  చదవడం మొదలు పెట్టారు . .ఎంతో పాండిత్యం  సంపాది౦చినా పిల్లలకు  పాఠాలు   సరైన   పద్దతుల్లో అర్థమయ్యే రీతిలో బోధి౦చడం  ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం  అని కృష్ణ శర్మ  గ్రహించాడు.  . 

కామెంట్‌లు