ఆత్రేయ .మానసి కవిత్వం :-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
సినిమా కవిత్వంలో 
ఎక్కువ మనసు పాటలతో 
నవరసాలు ఒలికించిన 
మన సుకవి ఆత్రేయ!
పెద్ద పెద్ద కళ్ళతో అలా చూస్తూ 
ఇలా వ్రాసే నేర్పు సొంతమే!
కాకపోతే... ఇదిగో అదుగో అని 
తిప్పుకోవడం... 
నిర్మాత జుట్టుపీక్కోవడం 
అన్నీ అయ్యాకే... 
మధురమైన పాట మనకి చేరేది 
పెద్ద మర్యాదస్థుడు కాదనేవాళ్ళు 
పాట చూసినక్షణం కళ్లనీళ్ళు... !

దర్శక నిర్మాతగా 
సామాజిక అంశాలతో 
చక్కని కథలకు రూపమిచ్చి 
వేదాంతం, తత్వం కలిసిన 
సహజ సంభాషణలతో 
రక్తి కట్టించారు !

మనసులోని భావాలు 
మనసు చేసే గారడీలు 
మనసు వల్లే కలిగే కష్టం 
అది వదిలేస్తే కలిగే లాభం 
అన్నీ... 
అలతి పదాలుతో 
అందరికి ఆమోదయోగ్యంగా
ఆహ్లాద కరంగా వ్రాసిన కవి 


అసలు విషాదపు పాటలు 
హిట్ కావడం 
ఈయన వల్లే అనిపించేలా... 
పామరుల మెప్పు కూడా 
పొందిన ఆ రచనల శైలి 
వీణ పాటలూ, సీసా పాటలూ 
ఒకే విధంగా జనరంజకం ఎలా చెప్మా...? 
అదే ఆత్రేయ ప్రత్యేకత!

కామెంట్‌లు