"బాలల భవిత ప్రశ్నార్థకం?":---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
చిన్నారుల చదువులకు
చిచ్చుపెట్టెను కరోనా
కన్నవారి గుండెల్లో
అంతులేని హైరానా

పిల్లల సందడి లేక
బడులు పోయెను వెలవెల
తల్లిదండ్రుల మనసులు
ఆడుతున్నవి విలవిల

బడికి పోక వారి భవిత
ప్రశ్నార్థకమవుతున్నది
ఆటకెక్కి విజ్ఞానం
కుంటబడి పోతున్నది


ఇకనైనా తెరుచుకోవా?
సరస్వతీ నిలయాలు
కేరింతలతో విరియవా?
చిన్నారుల హృదయాలు

కామెంట్‌లు