రామనామం-సాహితీసింధు సరళగున్నాల

 శా*శ్రీమద్రామునినామమెల్లరుచియైశ్రేయంబులన్గూర్చుచున్
ఏమాయల్నినుగ్రమ్మనీక గనుచున్నేవేళలందైననీ
క్షేమంబున్నిడివెల్గులన్నిమెరియన్ క్రీనీడలేదూరమై
ధీమంతంబగు జీవనమ్ముగలుగున్ దేదీప్యమానంబుగన్

కామెంట్‌లు