మానవత్వమన్నదే మనలోని రక్తం ,
కుల ,మతం పేరుతో దాన్ని కలుషితం కానీకు సోదరా.
మతమన్నది మనలోని దైవత్వాన్ని చూపేది ,
ఎన్ని మతాలున్నా అసలైన మతం మనవత్వమే సోదరా .
నిజం చెప్పాలంటే నీతి ఉండాలి ,
మంచిని చేయడానికీ మంచి మనసు ఉంటే చాలు సోదరా .
మానవత్వం మంటల్లో కాలుతుంది అన్యాయం భూమి పై నాట్యం చేస్తుంది ,
కులమతాలను కూలద్రోలి ధనం అనే దాహాన్ని పారద్రోలు సోదరా .
ఆడపిల్ల కన్నీరు అవనిపై పడుతుంది ,భూతల్లి మనసు కోపంతో రగలక ముందే ,
మనసులో నిండిన అన్యాయాన్ని తీసి ,మానవత్వాన్ని నింపుకో సోదరా.
ఐకమత్యమే అసలైన ఆయుధం ,స్వర్గం కాదా ఈ భూమి కలిసుంటే అందరం .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి