గురు గోవింద సింహ్...అచ్యుతుని రాజ్యశ్రీ

 1666లో గురు గోవింద్  పటనాలో పుట్టాడు. తండ్రి తేగ్ బహదూర్ ని మొగల్ పాదుషా క్రూరంగా హత్య చేయించాడు.9ఏళ్ళ గోవింద సమయం కోసం కాచుకున్నాడు.తను ఢిల్లీకి బైలుదేరేముందే కొడుకు చేతికి ఖడ్గంని ఇచ్చి  గురు గద్దె పై కూచోపెట్టాడు తేగ్."నాయనా!నీ ప్రాణాన్ని  పణంగా పెట్టి దీన్ని కాపాడు.ఢిల్లీ లో నాచావు తప్పదు. "తండ్రి మాటలకు గోవింద బెదిరిపోయి బావురుమనలేదు.తల నరికిన  తండ్రి మొండెం ఢిల్లీ నుంచి వచ్చాక ఆచిన్నారి గుండె మండి నిప్పులు చెరిగింది.సిక్కులంతా భయంభయంగా బిక్కచచ్చిపోయి ఉన్నారు. 20ఏళ్ళు  చెమటోడ్చి వారిని యుద్ధవీరులుగా గురు గోవింద సింహ్ సిక్కులను తీర్చిదిద్దారు. "స్వతంత్ర దేవికి ఎవరు తమని తాము అర్పించుకుంటారు?"గోవింద  ప్రశ్నకు 5గురు శిక్కులు ముందు కొచ్చారు.కొద్ది గంటల వ్యవధిలో 80వేలమంది  ఆత్మార్పణకు సిద్ధపడ్డారు. చుట్టుపక్కల హిందూ పాలకుల గుండెల్లో రాయిపడింది.గురు ద్రోహులై ఔరంగజేబు ని ఆశ్రయించారు. సర్ హింద్ లాహోర్ గవర్నర్లను  గురు గోవింద పైకి  పంపాడు ఔరంగజేబు. 1701లోఆనందపూర్ లో జరిగిన పోరాటం లో ఆహార పదార్థాలకొరత ఏర్పడింది. కేవలం 5గురు మాత్రమే బతికి బట్టకట్టారు.గోవిందుని ఇద్దరు కొడుకులు కూడా వీర మరణం పొందారు. వారు ఇస్లాం మతం స్వీకరించటానికి నిరాకరించారు. ఆపిల్లలని నిలబెట్టి  చుట్టూ గోడకట్టి సజీవ సమాధి చేశాడు ఔరంగజేబు. గురు గోవింద సింహ్ మారువేషంలో ఫిరోజ్ పుర్ వెళ్ళి కొత్త సైన్యంని సమకూర్చారు. మొగలుసైన్యం బ్రతుకు జీవుడా అని తోక ముడిచింది.1701లో ఔరంగజేబు గురు గోవింద సింహ్ ని కలవాలని  దక్షిణ భారతంవైపు సాగాడు.కానీ  దారిలో హరీ అన్నాడు.ఆతర్వాత ఢిల్లీ గద్దె ఎక్కిన బహదూర్ షా గురు గోవింద తో సంధి చేసుకున్నాడు. 1708లోఒక ద్రోహి  కత్తి పోటుకి  గురు గోవింద తుదిశ్వాస విడిచాడు. ఇది చరిత్ర. మరి పాఠాలు ఇవి విడమరిచి  నిజాలు చెప్పవు.ఇప్పుడు మనం ఏంచేయాలి?వజ్రోత్సవాలు ఘనంగా జరిపి చేతులు దులిపేసుకోటంకాదు. దేశం అంతా ఒకటే  .మనలో మనం పోట్లాడుకుని విషం కక్కే దేశాలకి చేయూత నిస్తే మళ్లీ  పరాయిపాలన బానిసత్వం తప్పదు. నా అనే స్వార్థం వీడి సరిహద్దులో కాపలా కాసే మన సైన్యం కి అండగా నిలవాలి. వారి కుటుంబాలు భార్య పిల్లలు  ఎంత త్యాగం చేస్తున్నారో గ్రహించడం ముఖ్యం.
కామెంట్‌లు