కురూపి.: --సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.

 వారణాసిలో ఒక వ్యాపారి ఉండేవాడు. తన వ్యాపారంలో కోట్లు గడించాడు. ఆ కోటీశ్వరుడి ఇంటికి కుంద య్య అనే అతడి పాత స్నేహితుడు అందవిహీనుడు వచ్చాడు. అతని పేరు విని రూపం చూసి వ్యాపారి పరివారం అంతా అతనిని అసహ్యించుకుంటున్నారు.
కానీ వ్యాపారి తన చిన్ననాటి స్నేహితుని గుర్తుపట్టి ఆదరించాడు.
అయినా కుందయ మిత్రమా నేను దురదృష్టం జాతకుడి ని. ముట్టుకున్న దంతా మట్టి అవుతుంది. నువ్వు పట్టింది అంతా బంగారం అవుతుంది. ముట్టిన దంతా ముత్యం అవుతుంది. నా దురదృష్టం నిన్ను అంటూ తుందేమో అన్నాడు. కుందూ నీ గుణం బంగారం. నాకు తెలుసు. నిన్ను నేను నీవు నిందించు కోకు ఆత్మ న్యూనత భావం విజయానికి ఆటంకం. నేటి నుంచి నువ్వు నా వ్యాపారానికి కోశాధికారి వి. నా కుటుంబం లో ఒక ఒక సభ్యుడు వి అన్నాడు.
మిగిలిన ఉద్యోగులంతా ఇతని పని ధ్యాస చూసి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని వెక్కిరించారు. వ్యాపారి పన్ను పోయే టంత కాటుక పెట్టుకున్నాడని నిందించారు. ఇంతలో వ్యాపారి ఊరు వెళ్లాల్సి వచ్చింది. మిత్రుడు నీ పిలిచి నా వ్యాపారం అనే అరణ్యంలో నక్కలు పాములు క్రూర మృగాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆహా వ్యాపారి వెళ్ళాడు దొంగలు పడితే ఏం నిర్వాకం చేస్తాడు అని హేళన చేశారు. ఈ కుట్ర తెలిసిన కుందయ ఆ రాత్రి కొందరు నమ్మకస్తులను పిలిచి ఒకడిని శంఖం ఊద మని, మరొకడి ని మద్దెల దరువు వెయ్యమని, మరొకరిని పాటలు పాడమని పురమాయించాడు. వరుసగా రెండు రాత్రులు గాన కచేరీలు జరిగాయి. ఆ హడావిడికి దొంగలు భయపడి పారిపోయారు. వ్యాపారి తిరిగి వచ్చి జరిగింది తెలుసుకొని మిత్రుని తెలివికి మురిసిపోయాడు.
తన వ్యాపారంలో వాటా కూడా ఇచ్చాడు.
నీతి. ఆత్మ న్యూనతా భావం విజయానికి ఆటంకం.

కామెంట్‌లు