సమస్య-సాహితీసింధు సరళగున్నాల
ఆ.వె*మోమునందునవ్వు పులుముకొనుచునుండి
మాటలందుతీపి మధువులూర
మోసపుచ్చువారు పూబంతులైనుండ
మానవతకులేదు మనుగడెపుడు

ఇ.వె*గొర్రెనమ్ముచుండు గొంతుగోసెడువాని
మానవులును నటులె మంచివీడి
ముంచువారలన్న మంచివారుగనమ్మ
మానవతకులేదు మనుగడెపుడు

తే.గీ*నోరుమాటలనాడుచు నొసలువెక్కి
రించి,కళ్ళెదుటను తీపి పంచిజూపి
వెనుకగోతులుదీయగా మునుగుచున్న
మానవతకునులేదయ్యె మనుగడెపుడు


కామెంట్‌లు