ఉదయ రా (రో ) గాలు...!!మనోహర్ పంత్ > భీమారం--హన్మకొండ *

 నా పేరు మునీశ్వర రావు,  నా భార్య పేరు 
ముగాంబిక.  మా ఇంటిపేరు శాంతినిలయం . మేముండేది,  ప్రశాంతి నగర్ లో.
పదిహేనేళ్ల క్రిందట, ఇరవై మంది మిత్రులం
రిటైర్మెంట్,  దగ్గర పడుతున్నప్పుడు, వూరికి, దూరంగా , ఈ కాలనీలో ఇల్లు కట్టుకున్నాము. 
పిల్లలందరూ దూరంగా వున్నారు.  అందరి 
ఇళ్లల్లో వృద్ధ జంటలే !
ఓ మూడు, నాలుగేళ్ల క్రితం దాక, మా కాలనీ చాలా ప్రశాంతంగానే , ఉండేది .
  కానీ తరువాత మొదలైంది :- 
ఉదయం సరిగ్గా ఐదు గంటలకు, ఢిల్లీలో 
పెద్దవాళ్ళ సమాధుల దగ్గర సర్వమత 
ప్రార్ధనలు పాడినట్లుగా , మా కాలనీకి 
నాలుగు వైపులనుంచి నాలుగు మతాల 
మైకులు , తలుపులన్నీ మూసుకున్నా 
ఇంట్లోకి దూరిపోతాయి . కొంచెం చిన్నగా 
అన్నా పెట్టమని చెపుదామని వెళితే,  అక్కడ ఎవరు వుండరు . ఒక సి. డి. 
పెట్టేసి,  తను ఇంటికి పోయి ముసుగుతన్ని పడుకుంటాడు . ఇది 
దాదాపు ఒక గంట భరింeచాలి .
వెంటనే ఇంకో మైక్. "  షెపద్ లేలియా హమ్నే  స్వచ్ఛ భారత్కా " అంటూ 
లొడలొడా శబ్దం చేస్తూ చెత్తబండి రొధ మొదలు!
"అమ్మా, లేత బెండకాయలు . మొగ్గలు. 
ఇప్పుడే కోసుకొస్తున్నా, పొయ్యి చూపిస్తే 
ఉడికిపోతాయి, "అని వూరిస్తూ, ఒకడి కేకలు .
"టమోటా కిలో ఇరవై , రెండు కిలోలు ముప్పై, రండి రండ"ని ఆశ పెడుతూ ఇంకోడు, 
"కొత్తిమెరమ్మా,  ఫ్రెష్, కట్ట పదే . పచ్చడి చేసుకు తింటే ఆకలి బాగా అవుతుంద"ని,
"వంతెన బూజు " గారిలా ఆరోగ్య సూత్రాలు చెపుతూ మరొకడు .
"పేపర్ కొంటాన్ , కాగితాల్ కొంటాన్ , 
పుస్తకాలు కొంటాన్ , విరిగిపోయిన కుర్చిలున్నా, పగిలిపోయిన డ్రమ్ములున్న 
పాడైపోయిన కూలర్లున్న , పనిచెయ్యని 
ఫ్రిడ్జిలున్న కొంటా , "మరో మైక్. 
ఈ గోలలన్నీ , ఐన తరువాత , భోంచేసి 
కాసేపు , రెస్ట్ తీసుకునే సమయానికి , 
ట్రింగ్,  ట్రింగ్,  ఫోన్లు.  "లోను కావాలా , 
ఇన్సూరెన్సు చేస్తారా , లే అవుట్ ప్లాట్లు, ".
ఇంతలో తలుపు చప్పుడు . "ఏ పేపర్ వేయించుకుంటున్నారు . మా పేపర్ తీసుకోండి" , మొహమాటం పెట్టేయటం. 
ఈ గోలకు అలవాటైపోయి , ఏది వినిపించక పోయినా , ఏమిటి ఇంకా 
కొత్తిమెర వాడు రాలేదని అనుకోవటం ,!
ఫోన్ మోగలేదని ఎదురు చూడటం !!.
ఇందులో,  మొదట పేర్కొన్న విభాగం తప్ప , మిగతా వారందరిది , బ్రతుకు
తెరువు . వారిని కించ పరచాలని కాదు , కానీ
కాలనీ అంతా , వినిపించేటట్లు , టి.వి. 
పెట్టె మహాను భావులు కొందరున్నారు .
వారికి "పెద్ద నమస్కారం " అనడం తప్ప ఏమి  చేయ
గలం.
కామెంట్‌లు