హరితహారం... అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆ కాలనీవాసులు బడి పిల్లలు అంతా సందడిగా హడావిడిగా తిరుగుతున్నారు. పిల్లలు కొందరు గోతులు తవ్వుతున్నారు.కొందరు మొక్కలు నాటుతున్నారు.. ఇంకొందరు నీరు పోస్తున్నారు. బడిలో ఐదో క్లాస్ నుంచి పదో క్లాసు పిల్లలు టీచర్ల పర్యవేక్షణలో కూరగాయల పూల విత్తనాలు మడులలో‌ చల్లారు.మెంతిగింజలు  ఒక మడిలో‌ ధనియాలు వేరే మడిలో చల్లారు. పుదీనా కొమ్మలు పాతారు.ఏక్లాస్ పిల్లల పాదులు బాగా వస్తాయో  వారి కి‌ బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.
 ఐదో తరగతి పిల్లలు చిక్కుడు కాకర గింజలు పాతారు. కొత్తిమీర ‌మెంతి మడులు 15రోజులకే మొలకెత్తటంతో 10వక్లాస్ పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు.హెచ్.ఎం.సార్ వారికి బహుమతి ఇచ్చారు.ఆపిల్లలు వాటిని కోసి కట్టలు కట్టి అధ్యాపకులు ‌ఆయాలకి ఇచ్చారు. "అయ్యో మా కాకర చిక్కుడు ఇంకా పెద్దగా పెరగలేదు.అవి ఎప్పుడు తీగెగా సాగి  కాస్తాయో?"అని ఐదో క్లాస్ పిల్లలు బిక్కమొహం వేశారు. నెలలు గడుస్తున్నా యి.తాము‌ వేసిన పందిరికి పూలు చిన్న చిన్న పిందెలు రావటంతో ఆపిల్లలు ఆనందంతో గంతులు వేశారు.
ఆరోజు కాకరకాయలు దాదాపు ఐదు కెజీలు వచ్చాయి.ఆపిల్లలసంబరం అంబరాన్ని అంటింది."ఛీ కాకర కాయ చేదు.'అని పిల్లలు ఇంటికి తీసికొని వెళ్ళటానికి ఇష్టపడలేదు.సైన్స్ టీచర్ ఇలా బోధించింది"ప్రతి కూరలో ఏదో ఒక విశేషం ఔషధీగుణాలున్నాయి. రోజూ వెరైటీ గా కూరలు తినాలి." 'ఉహు.. మాకు వద్దే వద్దు".
ఆరోజు రాఖీ పండుగ.పిల్లలకి భోజనం ఏర్పాటు చేశారు బడి యాజమాన్యం వారు.అక్కడే ఓ గోశాల కూడా ఏర్పాటు చేశారు.రాఖీలు పిల్లలు అంతా ఒకరికొకరు కట్టుకుని ఆటపాటలతో భోజనం టైం దాకా సందడిచేశారు.ఆయాలు టీచర్ పిల్లలు అంతా వంటలోసాయపడినారు.
అంతా లొట్టలు వేస్తూ తృప్తిగా
తిన్నారు."కూర ఎలా ఉంది పిల్లలూ?" సైన్స్ టీచర్ ప్రశ్న కి"తీయగా పుల్లగా ‌‌కాస్త ...భలేగా ఉంది.ఆకూర ఏం టి ?" ఐదో క్లాస్ పిల్లల ధర్మసందేహం! అంతా ఫక్కున నవ్వారు."మీరు వేసిన కాకరకాయ పాదు. ఇక్కడ మీరు పండించినవే మీకు వెండి పెట్టాం."హెచ్.ఎం.సార్ మాటలతో వారి మొహాలు చింకి చాటలంత అయినాయి.

కామెంట్‌లు