తెలుగు భాషను గౌరవిద్దాం
తెలుగు సంస్కృతిని ఆచరిద్దాం
అలనాటి కవుల సంస్కృతి కి పోరాడుదాం
శ్రీ కృష్ణదేవరాయుల కీర్తి చూడు
నన్నయ ,తిక్కన, ఎర్రన రచన చూడు
మాతృ భాష మనది తెలుగు
పచ్చగడ్డిని నరకడం చేసినట్లు చేసినా
మరలా పుట్టుకు వచ్చును
తీయనైన తేనెకన్న మధురం
వంశధార ,నాగావళి కన్నా స్వచ్ఛం
అమ్మ పాల తీయదనం
గో తల్లి పేరంటం
మర్చిపోవు భాష మన తెలుగు భాష
గొప్ప గొప్ప వారికి కీర్తి తెచ్చిపెట్టే
గురజాడ , శ్రీశ్రీ వారు వారు కొలువున్న సీమ
నాటి నుండి నేటి వరకు తెలుగు వెలుగు సొగసు
అందమైన తెలుగు అమ్మాయిల
అమృతం వంటి ప్రేమల
కదలాడే సముద్ర తరంగాలు లా
మర్చిపోను తెలుగు ముద్దుబిడ్డ తెలుగు తల్లి భాష
దేశ భాషలందు ఎన్నదగిన భాష
తెలుగే మన దేవాలయం
తెలుగే మన సభ్యత సంస్కృతి ఆచారం
ఎక్కడికి వెళ్ళినా నా భాషను మర్చిపోను
నా మాతృభాష విడిచి పోను
సముద్ర తరంగాలు లా
ఆకాశ జడివానలా
పసిబిడ్డ బోసినవ్వుల
తొలకరి జల్లు కురిపించు గలదు
అమృత ప్రవాహం మదిలో నింపగలదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి