చిక్కటి చెలిమి -సాహితీసింధు సరళ గున్నాల
కం*సంపదలుడుగును,చినుగును
నింపారగకట్టుబట్ట లెపుడోనొకచో
అంపకముండని స్నేహము
సంపాదనకన్నమిన్న సంతసమిడగా

కం*ఆస్తుల గొడవలునుండవు
నేస్థాయిననున్నవిడని యీచెలిమందున్
దోస్తులతో బాధల నో
మోస్తారుగజెప్పుకొనగ మోదముకలుగున్

కం*కష్టమువచ్చిన,చేతిని
ఇష్టముగానందుకొనుచు నేబాధైనన్
నష్టముపూడ్చగ ముందుకు
వ్యష్టిగతాకదిలివచ్చి బాధలదీర్చున్

కం*ధనమది యెంతగనున్నను
ధనమెప్పుడు వెంటరాదు తరుగునునెపుడో
మనకై స్నేహితులెప్పుడు
కొనయూపిరిదాకవెంట కొనసాగుదురే


కామెంట్‌లు