ఇంటా -బయట .. !! (మైలు రాళ్లు ): - డాక్టర్ . కె. ఎల్వీ . ప్రసాద్

 పిల్లల ఎదుగుదలలో అనేక మైలు రాళ్లు మనం గమనిస్తాం . ఎదుగుతున్న పిల్లల జీవితంలోని ప్రతి మైలు రాయి ఆ జీవితానికి పునాది రాయిలాంటిదే !
ఆ మైలు రాళ్లు పుష్టికరమైనవైతేనే ఆ జీవితం సంపూర్ణంగా సాగుతున్నట్టు 
లెక్క . బిడ్డ పుట్టిన తర్వాత క్రమంగా కనిపించే మార్పులన్నీ మైలు రాళ్లే !
పక్కలకు తిరగడం ,బోర్లాపడడం ,లేచి కూర్చోవడం ,నిలబడడం -నడక సాగించడం ఇవన్నీ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన ఘట్టాలు . బిడ్డ 
నిలబడడం ,నడడం ,వంటి మార్పులు వచ్చినప్పుడు ,తల్లిదండ్రులు పిల్ల 
ల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలి . పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలు ఈ 
సమయంలోనే ఎక్కువగా మన దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది . మనం 
అప్పుడు దృష్టిపెట్టక పోనట్లయితే ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకా-
శం వుంది . 
అందని వస్తువులను అందుకోవడానికి ప్రయత్నం చేయడం ,అందిన వస్తువు
లు లాగి కిందికి పారేయడం ,పదునైన వస్తువులు పట్టుకోవడం ,తెలియక వేడి నీటిలో చెయ్యి పెట్టడం ,చేతికి అందే ఎలెక్ట్రికల్ స్విచ్ బోర్డుల్లో వేళ్ళు పెట్టడం,
చేతికి అందిన ప్రతి వస్తువు నోట్లో పెట్టుకోవడం వంటి పనుల వల్ల లేని పోనీ 
ప్రమాదాలు ,వ్యాధులు సంక్రమించే అవకాశం వుంది. 
తల్లి వంటగదిలో ఏదో పనిలోపడి బిడ్డను వంటరిగా వదిలేస్తే ,జరగకూడనివి 
అన్నీ జరిగే ప్రమాదం వుంది . ఈ వయసులో పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి . ఇస్త్రీ చేసి ఇస్త్రీ పెట్టె పిల్లలు తిరిగే ప్రాంతాలలో ఉంచకూడదు .పిల్లలకు అడిగి వేడిగా వున్నఉ న్నదన్న విషయం తెలియక ,తెలిసినా వేడి 
వల్ల జరిగే ప్రమాదం తెలీక  ముట్టుకుంటారు . 
తర్వాత నీటి తో నిండి వున్న చిన్న నీటి తొట్టెలో పడి ఊపిరాడక ప్రాణాలు 
పోగొట్టుకున్న పిల్లలు వున్నారు . అందుచేత ఇలాంటివన్నీ పిల్లలకు దూరంగ
ఉంచే ప్రయత్నం చేయాలి . అలాగే పిల్లలకు దగ్గరలో నాణాలు ,అలాంటి చిన్న 
వస్తువులు ,మేకులు ,గుండు సూదులు పిల్లల కదలికలకు చాలా దూరంలో ఉండాలి . అలాగే కారం డబ్బాలు వగైరా పిల్లలకు దూరంగా ఉంచాలి .లేకుంటే 
పిల్లల జీవిత మైలు రాళ్ళ ఆనందం కాస్తా విషాదంగా మారే ప్రమాదం వుంది . 
అందుకే పిల్లలిని పెంచడము కూడా ఒక కళే సుమా !!
                                         ***


కామెంట్‌లు
Shyam kumar chagal చెప్పారు…
ప్రస్తుతం మనవడు మనమ రాలి సంరక్షణ అదే విధంగా చేస్తున్నాం sir. Thank you