దత్తపది:- స్వాతంత్ర్యము,స్వతంత్రము,స్వభావము, స్వాగతము - పదాలతో ఐచ్ఛిక పద్యం:-మమత ఐల-కరీంనగర్

 కం
సతమతమై స్వాతంత్ర్యము
స్వతంత్రముగ మారినగని సౌమ్యత లేకన్
యెతలకు స్వాగతమనుచున్
గతిదప్పె స్వభావరీతి ఘనముగ మనసా!
 సమస్యా పూరణ
*పారిపో ప్రజారాజ్యమా! పరుగు పెట్టి*
తే.గీ
నీతి ధర్మాల నెప్పుడు పాతి పెట్టి
మారి పోయెడి కాలన్ని మలచ లేక
నున్న నొరిగేడి ఫలమేమి నువిదపైన
*పారిపో ప్రజారాజ్యమా! పరుగు పెట్టి*

కామెంట్‌లు