అన్నచెల్లెలీఅనుబంధం*: బెజగాం శ్రీజ , గుర్రాలగొంది , సిద్ధిపేట జిల్లా

 *సీసమాలిక*
శ్రావణమాసాన చక్కగావచ్చును
రాఖిపౌర్ణంబుయె రయముగాను
అమ్మలోనమొదటి యక్షరంబగుచునె
యనురాగమునుపంచి హాయిపెంచు
నాన్నలోనసగము నాకు ద్విత్వముజేర
అన్నగా మారెను అక్షరములె
యాపదలేరాగ నండగనిలబడి
ధైర్యమునింపునే తండ్రిలాగ
అన్నయ్యఅనగానె యప్యాయతనుపంచి
మమతనుపంచునె మధురముగను
చివరి శ్వాసవరకు చెంతనే నిలిచియు
రక్షణనిచ్చును రమ్యముగను
*తేటగీతి*
రక్షబంధనుదినమున రాఖికట్టు
చెల్లి సోదరుడికెపుడు తల్లిలాగ
నోరు తీపినేజేసియు జోరుగాను
ప్రేమనేపంచుగొప్పగాప్రీతితోడ

కామెంట్‌లు
Unknown చెప్పారు…
అన్న చెల్లెళ్ళ గొప్ప పండుగ రాఖీ
ఈ రాఖీ నాడు నీ పద్యము బాగున్నది