*ద్విత్వాక్షర గేయాలు**ద-ద్ద ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

ముద్దులొలికే పాపాయి
అద్దాల గౌను తొడిగింది
అద్దంలోన చూసుకుని
బాగుందనీ మురిసింది

 పెద్దత్త ఇచ్చిన సద్దితో
ఎద్దుల బండిలో ఎక్కింది
సద్దిని తాతకు ఇచ్చింది
తాత పెట్టిన సద్దిని తింది

తాత చెప్పిన సుద్దులను
ముద్దు ముద్దుగా ఊ కొడుతూ
ఎంతో బుద్దిగా  వింటుంటే
తాతకు సంతోషమేసింది

కామెంట్‌లు