అమ్మకి నాన్నకి ప్రాణం అది
చూద్దామంటే చూడనివ్వరు
ఆడదామా అంటే ఆడనీయరు.
మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరు.
అన్ని తాళం వేస్తారు
ఎంతో శ్రద్ధగా చూస్తారు.
మా కబుర్లు ఏవి వినిపించుకోరు.
ఏ ఆటలాడిన మాటలే లేవు.
ఏ ప్రశ్న వేసినా బదులే చెప్పరు.
దానితోనే రోజులు గడిపేస్తారు.
ఆఫీస్ కి వెళ్తున్న సెలవులు వచ్చిన.
ఎన్ని పనులైనా చేస్తారు.
చేతిలోంచి దాన్ని మాత్రం విడిచిపెట్టరు.
మా చేతులు వదిలేసి కొన్నిసార్లు దాన్ని మాత్రమే భద్రంగా చూస్తారు.
అమ్మ నాన్న కి నాకంటే ఇష్టమైనది అదే లే.
అందరి మధ్య సరదాగా ఉన్నా అది పలకరిస్తే మురిసిపోతారు.
సెల్ ఫోన్ అంటే అందరికీ ఇష్టమైన శత్రువు, మిత్రుడు.
ఇష్టమైన శత్రువు :-తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి