చిట్టి పాప వచ్చింది
చిత్తు కాగితంతీసింది
మడత పెట్టి పెట్టింది
రాకెట్ గా మలిచింది !!
ఊరి వెలుపల కొచ్చింది
గుట్ట మీదికి ఎక్కింది
ఎగిరే పిట్టను చూసింది
ఎంతో మురిసిపోయింది !!
చేతిలో రాకెట్ విప్పింది
గబగబా పైకి విసిరింది
గాలిలో రాకెట్ లేసింది
గగనానికెళ్ళి ఎగిరింది !!
ఆమెకు యోచన కలిగింది
తను రాకెట్ ఎక్కాలనుకుంది
పెద్ద చదువులు చదివింది
చంద్రమండలం చేరింది !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి