బాల శివా - బాల గేయం (మణిపూసలు ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

శూలమెత్తి  బాల శివా 
సూటిగాను వేయిశివా 
దుష్టులపై నీ కోపం 
చూపు మయ్య బాల శివా!

అబద్దాలు అవని మించె
అన్యాయం గిరులు ముంచె 
అన్నిటినీ తొలగించిగ
బాల శివుడు అవతరించె !

నటన మాడు బాల శివా 
నవ్వు పంచు బాల శివా 
 నలుగురికీ ఉపయోగం 
మాకు తెలుపు బాల శివా!


కామెంట్‌లు