కర్రీ రంగులో కాకిని చూచి
కేకలు వేశారు ప్రజలు .
కాక అంటున్న అరుపులు చూసి
చీదరించారు కొందరు.
నల్లటి ముక్కుతో చీదరని
ఆరగించే టి వైనం చూసి
చీదరించారు కొందరు.
ఈసడించారు ఇంకొందరు.
కర్ర పుల్లలతో గూడును పేర్చి కల్మష మెరుగక
గుడ్లను పెట్టి పరాయి గుడ్లను
తన బిడ్డలుగా కూరిమి చూపెను కాకమ్మ.
ఆకటి వేళల దొరికిన
ఆధరువును ఆలోచించక కేకలు వేసి
అందరితో డి ఆకును చేరి ఆరగించునులే కాకమ్మ.
ఆనందించును కలసిమెలసి కాకులన్నీ ఒక్కటిగా చేరి.
కాకమ్మ (నీతి గేయం).:--తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి