పుట్టగుంట సురేష్ కుమార్ ఇక ఒక జ్ఞాపకం : టి వేదాంత సూరి

 మొగ్గలో లడ్డూల కథతో ప్రారంభమైన పుట్టగుంట సురేష్ కుమార్ గారు మొలక ద్వారా బాల సాహిత్యానికి మణిపూసల హారం వేసి వెళ్లారు.. ఎన్ని కథలు, రాసినా ఎందరు కథలు రాసినా సురేష్ గారి కథలు ప్రత్యేకమైనవి. అదే విధంగా అయన వ్యక్తిత్వం కూడా ప్రత్యేకమైనదే.. నిరంతరం సాహిత్యం, సమాజం, వ్యక్తిత్వం, కుటుంబం, ఆరోగ్య పరమైన ప్రతీ సందేహాలు   అడగడం తీర్చుకోవడం,అలవాటు. నిను సుదూరం లో వున్నా వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి కబుర్లు చెప్పేవారు. పిల్లలకు కథలు రాయడం లో జాగ్రత్తగా వుండాలని, కొత్త తరహాలో ఆకట్టుకునేలా వుండాలని, పిల్లలకు భయం , బాధ కలిగించేవి ఉండకూడదని చెప్పిన మాటలన్నీ చివరి రోజు వరకు గుర్తు చేసుకునేవారు.  వ్యక్తిగత సమస్యలతో బాధ పడుతున్నట్టు మాటల్లో అర్థమయ్యేది.  వారి చివరి వాట్స్ ఆప్ సందేశాలు మీకోసం ఇక్కడ ఇస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాను 
--------------------------------------------------------. 
సూరి గారూ నమస్తే.
2008 లో నాకు spine surgery జరిగినది కదండీ.
నేను కొంత కాలం క్రితం ఓ సమస్య విషయమై తీవ్ర మనోవేదనకు గురై seizure వచ్చి వెనక్కి పడిపోయాను.
దాంతో spine కు అమర్చిన rod విరిగినది.
నిన్న డా.సుబ్బయ్య గారిని  కలిశాము.
సర్జరీ చేసి Rod తీసేయాలి లేకుంటే infection వస్తుంది అని చెప్పారు.7
అందువలన సర్జరీకి సిద్ధమవుతున్నాను.
------------------------------------------------
 రేపు ఉదయం సర్జరీ.
మీలాంటి ఉత్తమోత్తములతో స్నేహం , దైవ కృపతో విజయవంతంగా వస్తానండి 
-పి . సురేష్ కుమార్ 
కామెంట్‌లు