105.దుఃఖాల గరీబ్ కాబోకు!
నవ్వుల నవాబై బతుకు!
సమస్యల జవాబురా నవ్వు!
నవ్వులతో జగమే వెలుగు!
106.ఏడ్చే బతుకు చావు!
నవ్వుతోచావు చాలాసులువు!
చిరకాలం ధూమం కన్నా,
క్షణకాలం జ్వాలే మిన్న!
107.
నవ్వుల విత్తనాలు నాటాలి!
ఆనందాల మొలకలు రావాలి!
పలుకుల చిలకలకు,
కొమ్మలై నిలవాలి!
మధురరావాలతో ,
పరిసరాలు నిండాలి!
108.పరమాత్మునికి,నవ్వుల!
ఆసనం వేయాలి!
అభిషేకం చేయాలి!
అర్చన సమర్పించాలి!
నవ్వే నైవేద్యం పెట్టాలి!
109. నిరంతరసాధనతో,
నవ్వులే సాలోక్యం!
నవ్వులే. సామీప్యం!
నవ్వులే సారూప్యం!
నవ్వులే సాయుజ్యం!
(కొనసాగింపు)
*నవ్వులు-కర్తవ్యం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి