*"కొందరి" నవ్వులు*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 44.ప్రసవవేదన గెలిచి,
   జన్మించిన శిశువును చూచి,
    పెదాలపై "నవ్వు" మొలిచి,
  మాతృమూర్తి అమృతమూర్తి!45. యుద్ధానికి వీరుడ్ని పంపే,
       వీరపత్ని శక్తి ఆమె నవ్వే,
      అతడికి భువిలో విజయం,
      లేకుంటే దివిలో స్వర్గం!
46. శత్రువు నవ్వు,
       పచ్చల పిడిబాకు,
      అజాతశత్రువు నవ్వు,
      సహస్రదళపద్మపూరేకు!
47."హీరో" నవ్వు,
      "గ్రేట్" ఫాన్స్ ఫాలోయింగ్,
       "షోలే" విలన్ నవ్వు,
        "హార్ట్" బ్రేకింగ్!
48.నచ్చిన అమ్మాయి,
     నవ్వు సన్నాయి,
     నవ్వితే చెప్పలేని హాయి,
     ఇక పలికితే పగలే రేయి!
49.నాయకుని నవ్వు,
    పాలితులకు అభయమవ్వు,
   ఆపదలలో రక్షణ ఇవ్వు,
  అనుక్షణం ఆధారమై నిలువు!
50. శాస్త్రవేత్త నవ్వు,
      అన్వేషణలో పూర్ణత్వం,
      సామాజిక సేవాతత్త్వం,
      జీవనసాఫల్య సిద్ధత్వం!
51.పరమాత్మ నవ్వు,
      ఆర్తులకు అభయం,
      అర్థులకు దివ్యవరం,
      జిజ్ఞాసువులకు  విజ్ఞానం,
     జ్ఞానులకు శాంతిదాయకం!
          (కొనసాగింపు)

కామెంట్‌లు