ఇష్టం.(బాలగేయం):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

బాలబాలికలం మేము
భావిపౌరులం మేము
నచ్చనిపనులు మేముచేయము
ఇష్టమైనవే చేసేస్తాము !!బాల!!

బడితెపూజలు మాకునచ్చదు
కథలూనవ్వులు మాకిష్టం
తొడపాశాలూ మాకునచ్చదు
మెదడుకుపదును మాకిష్టం !!బాల!!

నాల్గుగోడలూ మాకునచ్చదు
ఆరుబయలే మాకిష్టం
బలవంతాలు మాకు నచ్చదు
ఆటాపాటా మాకిష్టం !!బాల!!

కోపముశాపము మాకునచ్చదు
అల్లరిపనులే మాకిష్టం
మారణహోమం మాకునచ్చదు
సత్యాహింసలు మాకిష్టం !!బాల!!

దౌర్జన్యంకాఠిన్యం మాకునచ్చదు
దయాజాలీ మాకిష్టం
అన్యాయాలూఆవేదనలూ మాకునచ్చదు
ప్రేమానురాగాలు మాకిష్టం !!బాల!!


కామెంట్‌లు