*అనుబంధాలకు ప్రతీక రాఖి*:-*-డా. చిటికెన కిరణ్ కుమార్*Member, IBRF సెల్.9490841284రాజన్న సిరిసిల్ల.

   *అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్లు ఎప్పటికీ ఎన్నటికీ మరచిపోలేని అనుబంధం రాఖీ పండుగ తో ముడి వేయబడుతుంది. ప్రేమకు ప్రతిరూపంగా అక్కచెల్లెళ్ళు నిండు మనసుతో అన్నా తమ్ముళ్ల శ్రేయస్సు కోరుతూ జరుపుకునే అతి గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి ( రాఖి  )*
*పురాణాల్లో రాఖీ పండుగ గురించి ఒక కథ* .
వృత్తాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు ఓటమి అంచులకు చేరతాడట. అప్పుడు తన పతికి పరాజయం కలగకూడదని కోరుతూ, ఇంద్రుని భార్య అయిన శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని, అలా రాఖీ పుట్టిందని పండితులు చెబుతారు.
*చరిత్రలో రక్షాబంధన్ గురించి ..*
పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి.మృగశిర కార్తె ప్రాముఖ్యత, ఆరోజే చేపలు ఎందుకు తింటారు పురాణాలు, ప్రాచీన గ్రంథాలలోనే కాదు.... రాఖీ సంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు, అతడిని పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో, అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందట. మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్కి రాఖీని పంపిందని చరిత్ర చెబుతోంది. ఇక రవీంద్రనాథ్ టాగూర్ సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట.
*ఎదురు చూసే వేళ...*
ప్రతి రాఖీ పండుగ రోజు తన చెల్లెలు, అక్కలు తన చేతికి రాఖీ కట్టే ఆ శుభ సమయం కోసం ప్రతి ఇంటిలో ఆ సందడి ఉంటుంది ఎంతో ప్రేమ అనురాగాలతో జరుపుకునే ఈ పండుగ  భారతీయ సంప్రదాయాలలో  ఒక ప్రత్యేక స్థానం కలిగింది అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి పెళ్లి అయి అత్తవారింటికి వెళ్ళిన తరువాత  కూడా  ఈ పండుగ రోజున అన్నా, తమ్ముళ్ల దగ్గరికి  అక్కలు చెల్లెల్లు వచ్చి  రాఖీ కట్టాలని ప్రతి సోదరిమణి కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే సుదూరంలో ఉన్న వారు కూడా ఈ పండుగ రోజున వీరి దగ్గరికి వచ్చి రాఖీ కట్టి    మిఠాయిలతో  నోరు తీపి చేసుకుంటారు. ఇక పొతే రాఖ్రిని ఎవరైనా బంధువు లేదా సంబంధం లేని వ్యక్తులకు కూడా సోదరులుగా భావించి కట్టవచ్చు. ఎవరైనా స్త్రీ సంబంధం లేని వ్యక్తి చేతికి రాఖీ ని కడితే వారిమధ్య సోదరీ, సోదరుల అనుబంధం ఉన్నట్లు భావించబడుతుంది. ఈ పండుగ తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, తాతల దినోత్సవం వలె తోబుట్టువుల దినోత్సవంగా భావిస్తారు.


కామెంట్‌లు