"హిందీభాషాదినోత్సవం-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
తే.గీ.
"దేవనాగరిలిపినుండితేజరిల్లి"
"రాజభాషగాయలరారిరంజితముగ"
"భరతజాతీయభాషగావరలుచుండి"
"హిందిసాహితీసిరులుపసందుగొలుపు"!!!

02.
తే.గీ.
"జాతియోద్యమకాలానచరితకెక్కి"
"తులసిదాసునిచేతిలోవిలువగాంచి"
"సూరదాసునికృతులలోసొంపుగొలిపి"
"హిందివిభవమ్మునివ్విధియినుమడించె"!!!

03.
తే.గీ.
"నాడుఐరాససభలోననవ్య గతిని"
"హిందిలోప్రసంగించియునీప్సితముగ"
"అటలుబీహారివాజ్ పేయి యద్భుతముగ"
"భాషమకరందమునుపంచెభాగ్యమలర"!!!

04.
తే.గీ.
"భువిత్రిభాషసూత్రమ్ములోపొందుగాను"
"నిలిచివొదిగియుమెండుగాఫలితమొసగె"
"ఢిల్లినగరాననీభాషఠీవిగొల్పు"
"ముచ్చటింతురుజనులంతముదముగాను"!!!


కామెంట్‌లు