01.
కం.
పలుప్రాజెక్టులనెన్నియొ
సులువుగనిర్మించినట్టిసుజనుడుతానున్
పలువురిమన్ననలొందియు
వెలిగెను"విశ్వేశ్వరయ్య"విశ్వమునందున్!!!
02.
కం.
మూసీనదివరదలకును
వాసిగపథకమురచించిభయమునుతొలచెన్
చేసెనుతగుయేర్పాట్లను
చూసినవారందరికిదిచోద్యంబాయెన్!!!
03.
కం.
జలవినియోగముగూర్చియు
పలువిధములుగానుడివినపండితుడతడున్
అలుపెరుగనిశ్రమజేసియు
ఫలితాలనుపొందినట్టిభారతిసుతుడున్!!!
04.
కం.
భారతకీర్తినిచాటిన
ధీరుడువిశ్వేశ్వరయ్యతేజోమయుడున్
సారథియైముందునడిచి
పేరునుపొందెనుఘనముగవిలువలతోడన్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి