01.
తే.గీ.
రకరకమ్ములనగలనురాత్రిపవలు
చేసియందించు"కంసాలి"చేవతోడ
చేతివృత్తిలోనిపుణతచేసిజూపి
నిలుచుభువిపైనసతతంబునిండుగాను!!!
02.
తే.గీ.
కంఠహారముల్ ,పుస్తెలు కమ్మలజత
ముక్కుపుల్లలు,నుంగరాల్ మిక్కిలిగను
క్యాటులాగునుజూపించిపాటవముగ
నగలనందించు"కంసాలి"నవయుగమున!!!
03.
తే.గీ.
వెండి,పుత్తడినగలనువేగిరముగ
యంత్రపరికరంబులతోడమంత్రణముగ
అందజేసియుకనులకువిందుగొల్పు
"విశ్వబ్రాహ్మణుడీరీతివిశ్వమందు"!!!
04.
కం.
వెండియు,బంగారమ్మును
నిండుగకరిగించితానునీరమువోలెన్
ఖండితముగజేసుకొనియు
మెండుగనగలందజేయుమెళకువతోడన్!!!
"స్వర్ణకారుని పనితనము-పద్యాంజలి"!!!:"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు--సిద్ధిపేట-చరవాణి :- 6300474467
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి