"వరప్రదాయినిభద్రకాళిస్తుతి-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467

 ఉత్సాహపద్యములు
01.
నేటిఓరుగల్లునందునిమ్మళముగవెలసెలే
పాటిగానుకొలుచుచుండవరములెన్నొనొసగులే
కోటిపుణ్యఫలములిచ్చికోర్కెలన్నిదీర్చులే
పాటలెన్నొపాడుచుండభద్రకాళిమెచ్చులే !!!
02.
తీరుగానుమ్రొక్కులిచ్చిదీక్షతోడగొల్వగా
చారునేత్రిభద్రకాళిజయముగల్గజేయదే
కోరినట్లుసిద్ధిబుద్ధికొరతలేకనిచ్చులే
దారిజూపిమనలవెంటతప్పకుండనుండునే !!!
03.
మూడులోకములనునేలిముదమునొందుదానవే
వేడుకొందుగాదెమిమ్మువిడువకుండనేనికన్
చూడవమ్మనన్నునొక్కచూపుమీరనెప్పుడున్
తోడునిలిచిరక్షజేసి,తొలగజేయువేదనల్!!!
04.
నిరతముగనుడెందమందునిల్పుకొందుమిమ్ములన్
మరణసమయమందుకూడమరువజాలకుందునే
దురితములనుపారద్రోలిదుష్టశక్తులణచవే
కరుణజూపుభద్రకాళికల్పవల్లినీవెలే!!!


కామెంట్‌లు