పచ్చని చెట్లు(బాలగేయం):-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464
చిన్ని చిన్నీ మొక్కలు నాటీ
కలసి మెలసి పెంచగ రారండీ
చిగురులు తొడిగీ ఆకులు వేసి
సొగసుతో పెరుగును కదండీ

పచ్చపచ్చని చెట్లన్నీ
ప్రగతికి వేయును బాటలు అండీ
విషగాలిని తొలగించేసి
ప్రాణవాయువును ఒసగును అండీ

చల్లని గాలులు కమ్ముకొనీ
వానలు మెండుగ పడతాయండీ
వాగులు వంకలు గలగల పారీ
పంటలు ఏపుగ పెరుగును లెండి

అవని అంతా తరువులతో
పూలు ఫలాలు ఇచ్చును అండీ
శుభకార్యాలకు శోభలతో
సంతోషాలను పంచును అండీ


కామెంట్‌లు