పల్లవి:-
ఓంకార రూపా ఓ గణపయ్య
విఘ్నాలు తొలగించు మా గణపయ్య//2//
చరణం:-1
వనములు తిరిగి ఆకులు తెచ్చి
తీరొక్కపులతో కొలిచెమయ్యా
జపములు తపముల సాధనతో
తొలిపూజ నీకే ఓ విఘ్నరాజా
//ఓంకార//
చరణం:-2
పార్వతి తనయా గజముఖ వదనా
రయమున రావా లంబోదరా
చదువులు సాగే మార్గం చూపి
సందడి చేయగ రావయ్యా
//ఓంకార//
చరణం:-3
పిండిబొమ్మకే ప్రాణం పొసే
పార్వతి మాతా రక్షణకోసo
మట్టి గణపతినే మసమంత పెడుదo
పర్యావరణం రక్షణ కోరి
//ఓంకార//
చరణం:-4
మంచి మనసున్న చాలు
మహిమగల దైవం కోసం
ప్రకృతితో మమేకమయ్యి
ప్రాణమిల్లు కుందాం
//ఓంకార//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి