జీవనాధారం నీరు:-చైతన్య భారతి పోతుల హైదరాబాద్7013264464

సప్త సముద్రాల నిండిన నీ రూపము
సకల ప్రాణికోటి కాధారము
పచ్చదనాన్ని నిలుపు నీరము
మబ్బులై కరుణించు జలము

ఆకుపచ్చని వనములున్న పవనములు
జడివానలై నింపు జలధులు
రైతన్నల కడగండ్లను బాపు వానలు
నీరు లేకున్న నెల్లవు మా దినములు

ప్రేమ చూపి కటాక్షములందించు
జీవనదులు పారి జలసిరులు కురిపించు
ప్రకోపిస్తే జలవిలయం సృష్టించు
జనజీవనం స్తంభించి ప్రాణాలు హరించు

అకాల వర్షాలతో తల్లీ నీవు
పంటచేలన్నీ ఏటిపాలు చేసెదవు
ప్రాణం పోయానూ..తీయనూ గలవు
ఆరోగ్యమిచ్చి ఆయువు పెంచగలవు

సంస్కృతీ సాంప్రదాయాలకు నీరు
పరిసరాల పరిశుబ్రానికి నీరు
పొదుపుగా వాడితే అంతటా పన్నీరు
స్వార్థం నిండితే భవిష్యత్తులో కన్నీరు

అందమైన హరిత వనాలు
భూగర్భజలాల సంరక్షణలు
ముందుతారాల కోసం ఆలోచనలు
చేస్తూ పంచుదాం ఆనందాలు

కామెంట్‌లు