*ఓ పువ్వుల్లారా........!*:-*" రసస్రవంతి "7075505464**" కావ్యసుధ " 9247313488*( విశ్రాంత సీనియర్ జర్నలిస్టులు ) హైదరాబాదు.

 మా ఇంటి పెరట్లో
రకరకాల పూల మొక్కలు
ఉదయం సాయంత్రం
నీళ్ళు పోస్తాము మొక్కలకు
మా సేవలకు పులకించి
పరవశించి, పుష్పించి పరిమళించి 
పూసిన పూలన్నీ   
మా ఇంటి గదులన్నీ 
పరిమళం నింపుతున్నాయి
ఓ పువ్వుల్లారా ! మీరు
కలకాలం  ఇలాగే......
నిత్యం పుష్పించి
మా పరిసరాలను కూడా 
పరిమళాలతో నింపండి.
భగవంతుని పూజలలో
మీ బ్రతుకులు.....
పునీతం చేసుకోండి.
ఈర్ష ,ద్వేషం నిండిన
కల్మష కర్కశ హృదయాల్లో
పరిమళాలు నింపండి.
కఠినాత్ముల మనస్సుల్లో
పరిమళాలు వొంపండి.
కుల మత ద్వేషాలతో
కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని
పరిమళభరితం చెయ్యండి.

కామెంట్‌లు