అమ్మ:--- శిరీష వూటూరి--సెల్ నెంబర్: 8008811669

అమ్మంటే రెండక్షరాల‌ పదం కాదు 
విలువైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం

మమకారం అనే ముద్దలు కలిపి
కడుపు నింపుతుంది అమ్మ!

మురిపాల లాలి పాట పాడి 
నిద్ర పుచ్చుతుంది అమ్మ!

తనవారి ఎదుగుదల లోనే 
తన సంతోషాన్ని వెతుక్కుంటుంది అమ్మ !

మన మౌనాన్ని, చింతను 
చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది అమ్మ!

నడక నేర్పి, నడత మార్చి జీవిత 
పాఠాలు నేర్పించేది అమ్మ!

అమ్మ ప్రేమ వెలకట్టలేనిది
ఎంత చేసినా అమ్మ రుణం తీర్చుకోలేనిది..........

కామెంట్‌లు