ప: గుణింతము గేయం:-ఏ.సంయుక్త,8వ,తరగతి,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాకజిల్లా:సిద్దిపేట

 పలకల మీద దిద్దుదాము                     
 పావురాలను చూద్దాము                
పిచ్చుకలతో ఆడుదాము
పీచుమీఠాయి తిందాము
పుస్తకాలు కొందాము
పూజ చేసి చదువుదాం
 పృథ్వి అంత వెలుగుదాం 
ప్రూ అక్ష పలుకుదాము
పెరుగు అన్నము తిందాము
పేర్లను పలుకుదాము
పై చదువుల కెదుగుదాం 
పొగడ్తలను ఆపుదాము
పోరాటం చేద్దాము
పౌరుషంతో బతుకుదాము 
పంచదార పంచుదాము
కామెంట్‌లు