మా ఊరు (కవిత):---: పూజ8వ,తరగతిజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక

 నేను పుట్టిన మా ఊరు
అదే నా పాలిట హరివిల్లు
ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు
పల్లె జీవితం ఆరోగ్యానికి శుభప్రదం
నా పల్లె లో అందమైన చెరువులు
ఆ చెరువులోని నీరే ప్రాణాధారం
అదే జలం మాకు బలం
అక్కడి తామరల కమనీయం
విరబూసిన అరవిందాలు
లేలేత ప్రభాకరుని కిరణిలు
చూడడానికి రెండు కళ్ళు చాలవు
చెరువులు కళకళలాడాలి
ప్రభుత్వ ఆశయ సాధన సిద్దించాలి

కామెంట్‌లు