ఆటవెలదులు: అంశం :- లోకరీతి:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
పరుల వల్ల కీడు వాటిల్లు చుండగా
కఠిన గుణము వచ్చి కాల్చుచుండు
పట్టు బట్టి తలన పరులెక్క తగదయా
మనసుపెట్టి వినుముమమత మాట
ఆ.వె
చవకబారుగుణము సాధించి జనులను
పీల్చి పిప్పిచేయు ప్రీతికనక
మొగిలివాసనెపుడు మొరటుగాళ్ళెరుగరె
మనసు పెట్టి వినుము మమత మాట
ఆ.వె
గోడ పిడకలన్ని గొప్ప యనుచు పొంగి
నిప్పు లోకి దూరు నిజమునమ్ము
చెంచ గాళ్ళు కూడ చిక్కేరు యెప్పుడో
మనసు పెట్టి వినుము మమత మాట

కామెంట్‌లు