ఆటవెలదులు--అంశం:- లోకరీతి:-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
అడప దడప వచ్చునాటంక ములబెంగ
సహజ మేను మనిషి జన్మలోన
చిన్న బోయిన మది చిరకాలముండునా
మనసు పెట్టి వినుము మమతమాట
కం
మనసే దైవము దైనను
పనిగట్టుకు రాదు వినుము పతనముదరికిన్
ఘనమగు శక్తితొ బుద్ధితొ
పనులెల్లను జేయ తొలగు బలహీనతలే


కామెంట్‌లు