*వని లంకను గాల్చెనౌర వనితను వెదకన్*
కం
ఘనముగ గాలినయెగిరెను
వనమున జానకిని గాంచ వాయుసుతుండే
కనివిని యెరుగని రీతి న
*వని లంకను గాల్చెనౌర వనితను వెదకన్*
సమస్యా పూరణలు
*జాతి జాగృతి యభివృద్ధి నేతిబీర*
ఆ.వె
తపన చెందువారు తండోప తండాలు
తగునుపాధి కొరకు తల్లడిల్లి
జాబులిడక వారి జేబునింపెడి యిట్టి
*జాతి జాగృతి యభి వృద్ధి నేతిబీర*
ఆ.వె
సోమరులను జేసి సోడుబియ్యంబియ్య
పాడెనెక్కు దాక పనులు లేవె
తాడుబొంగరంబు తలకేసి కూర్చున్న
*జాతి జాగృతి యభివృద్ధి నేతిబీర*
ఆ.వె
ఎట్టి కుండెను కద యెకరాల భూములు
యిచ్చి దున్ను మనిన యింపుగాద
మచ్చుకైన చిన్న మంచి చేయకనున్న
*జాతి జాగృతి యభివృద్ధి నేతిబీర*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి