పద్యాలు : --*బెజుగాం శ్రీజ**గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట**చరవాణి:9391097371*

 *సీసమాలిక*
ఈసమాజములోన యేతప్పుజేసెను
చిన్నారి చైత్రయే చెల్లిపోయె
చిన్నారిపాపను చిత్రహింసలు బెట్టి
మూర్ఖంగాచంపెను మూర్ఖుడిపుడు
ఆపసికందును అమ్మనాన్నలకును
దూరంబుజేసిన ధూర్తుడితడు
ఆడపిల్లకెపుడునవనిలో జూడగ
కష్టాలుదప్పవా ఖలుల వలన
బుద్దిగడ్డితినగ మూర్ఖంగామారియు
కక్షలుగట్టెను కన్యలందు
స్త్రీలకైభద్రత క్షేమముకోరియు
రక్షణనివ్వాలి లక్షణముగ
బయటకెళ్లాలంటె భయపడికూర్చోని
ఇంట్లోనె వుండాల యింతులంత?
*తేటగీతి*
ఆడుకొనెడివయస్సులోనందమైన
చిట్టితల్లినిచంపినశిక్షకుడికి
తగినచర్యలుచేపట్టి ధర్మముగను
శిక్షవేయాలిచట్టము శీఘ్రముగను.

కామెంట్‌లు