*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౪ - 94)

 శార్దూలము:
*నీ భక్తుల్పదివేల భంగుల నిను | న్సేవింపుచున్ వేడగా* *లోభంబేటికి, వారికోర్కులు కృపా | ళుత్వంబునం దీర్పరా*
*దా! భవ్యంబుదలచిచూడు, పరమా | ర్థంబిచ్చి పొమ్మన్న, నీ*
*శ్రీభండారములో గొరంతపడునా? | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
రక రకాలుగా, ఎన్నో విధాలుగా వున్న నీ భక్తులు నిన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిన్ను పూజించి వారి గొంతెమ్మ కోర్కెలు కోరుకుంటారు కదా వారి కోరికలు తీర్చి నీవు హాయిగా వుండవచ్చు కదా, మహాదేవా!  ఈ భక్తుల చిన్న చిన్న కోరిక ఎదైనా తీర్చేస్తే నీ మహా సాగరం లాంటి ఖజానా ఎమైనా ఖాళీ అవుతుందా ఏంటి......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మా సంగతి నీకు ఎప్పడో విన్నవించుకున్నాము. మేము చాలా  బలహీనులము. మాకు మానసిక స్థిరత చాలా తక్కువ. అందువల్ల మేము కోరుకునే చిన్న చిన్న కోరికలను  నీవు తీర్చవచ్చు కదా.  అలా నీవు మా కోర్కెలు తీర్చి మాకు పరమపదం ఇచ్చి నందు వల్ల నీ దగ్గర వున్ సామర్థ్యం ఏమైనా తగ్గుతుందా, విరూపాక్షా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు