అమూల్య సంపద జలం(కవిత);-డి.కె.చదువులబాబుతెలుగు ఉపాధ్యాయుడుప్రొద్దుటూరు.కడపజిల్లా.9440703716

 శుష్కిస్తున్న నీటివనరులు
అంతర్ధానమవుతున్న సలిలము
భూగర్భంలో నీటిజాడెక్కడ?
భూమి జలగ్రహమనేది నేటిమాట
జలరహిత గ్రహమనేది భవిష్యత్ మాట
నదీమాత సైకతగర్భం
మనిషి స్వార్థానికి బలైపోతున్న సమయమిది
అంభస్సు అదృశ్యంతో అనావృష్టి
చినుకుకోసం ఆకలి చూపులు
పగుళ్ళు బారిన పృధ్వి
గ్రాసంకోసం కటకట
దాహాగ్నితో భూమి భస్మీపటలం
ఇక్కడి నీటివృధా
మరెక్కడో దాహపు వ్యధవుతోంది
నీరులేక కన్నీరు ఇంకుతోంది
జలచక్రం ప్రకృతివరం
జలసమృద్ధితో ధరణి సస్యశ్యామలం
జలంతోనే జగతిలో విభాప్రభాతములు
అవనిలో అమూల్యసంపద జలం
మధువును పొదుపుచేయు జుంటీగ
ధాన్యంను పొదుపుచేయు పిపీలికం
ఆచిన్నజీవుల ముందుచూపు
మనిషికి లేకుండుట వింతకాదా?
జలం మన సంస్కృతి
బొట్టుబొట్టు ఒడిసిపడితే
బిందువులే సింధువులు కావా?
నీటిపొదుపులేని జీవితం నిష్పలం
జలసంరక్షణలో దీక్షాధారులమవ్వాలి
నీటిసంరక్షణ నిష్టతో సాగాలి
నీటి పొదుపు నినాదం
ప్రతినోటా నిర్ఘోషించాలి!!

కామెంట్‌లు