సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414

 --అనువాదం అనువాదం అంటే వాకిలి/కిటికీ తెరకు మరోవైపు. లియొనార్డ్ సియాసియ 


--అనువాదం అంటే. భాషలో, భావంలో రాజీపడటమే. బెంజమిన్ జోవెట్


--అనువాదం మాటలను మార్చడమే కాదు, మొత్తం సంస్కృతిని చెప్పడం. ఆంథోని బర్జెస్

--అనువాదం రెండువైపుల పదునుగల ఆయుధం వంటిది. ఒకవైపున పరాయిభాషలోగల ప్రావీణ్యం, మరోపక్క సామర్ధ్యం చూపగలగాలి. పీటర్ న్యూమార్క్

--అనువాదం లేకపోతే నేను నాదేశ సరిహద్దులకే పరిమితమై ఉండేవాడిని.అనువాదకుడు నా ఆప్తమిత్రుడు. అతను నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఇటాలో కాల్వినో

--అనువాదం స్వయంసృష్టి కాదు. అనువాదంలో కొంతనష్టం తప్పనిసరి. జోసెఫ్ బ్రాడ్ స్కయ్

--ఏ విషయమూ మారకుండా అన్ని వస్తువులూ రూపాంతరం చెందటమే అనువాదం. గుంటర్ గ్రాస్

-


కచ్చితమైన, సరైన అనువాదం అసాధ్యం. రాబర్ట్ యం. గ్రాంట్

--పాటలోని సాహిత్యాన్ని, సంగీతాన్ని రెంటినీ అందించేది మంచి అనువాదం. జాన్ మిల్లింగ్ టన్ సింజె

--ప్రతి భాషా ఒక ప్రపంచం. అనువాదం లేకపోతే మౌనాలే మన మాటలు అయేవి. జార్జ్ స్టెయినర్

--మూలంలోదే చెప్పటం అనువాదం కాదు, మూలరచయిత చెప్పినట్లు చెప్పగలగాలి. జాన్ కానింగ్ టన్

--సాహిత్య అనువాదం కేవలం ఒక భాషాపదాలను ఏరుకొని, మరో పాత్రలో ముంచి చూపడం కాదు. ఈ మాటలను వీలయినంతగా ఝాడించాలి, పిండాలి, చెక్కాలి, అలంకరించాలి. సుమన్ పోఖ్రెల్

కామెంట్‌లు