ప్రజాకవి కాళోజీ:-:కటుకం రాజయ్యకలంపేరు:సంఘమిత్రచరవాణి సంఖ్య:9441560232
 పల్లవి:జోహారులు కాళోజీనీకు జోహారులు
           ప్రజల మనిషి ప్రజాకవికి జోహారులు "2"
కర్ణాటక రాష్ట్రములో రట్డహళ్ళిలో పుట్డినావు
పుట్టగానే తల్లిప్రేమకు అప్పుడే దూరమయ్యినావు
అన్న రామేశ్వర రావు అడుగుజాడలో పెరిగినావు
ఆర్య సమాజ్ ఉద్యమములో అడుగులేసి కదిలినావు
        ‌             ‌"జోహారులు "
పౌరహక్కుల సంఘానికి ప్రతినిధిగా నిలసినావు
గ్రంథాలయ ఉద్యమములో  నీ ప్రతిభను చాటినావు  .ఆంధ్రమహాసభలల్లో ఆరితేరి నిలసినావు
ప్రజాకవిగా పేరుబొంది ప్రజలలోన వెలిగినావు
            "జోహారులు"
ప్రజలగొడువె నాగొడువని ఖండకావ్యము రాసినావు
పుటకనీది చావునీది బ్రతుకు దేశానిదన్నావు
నైజాము కారుపైన బాంబు చేత విసిరావు
తెలంగాణ పౌరుషాన్ని ఎలుగెత్తి చాటినావు
                  "జోహారులు"
అక్షర రూపము దాల్చిన సిరా చుక్కలు 
లక్షల మెదళ్ళను కదిలిస్తయంటివి
తెలంగాణ రచయితల సంఘంబు బెడితివి
సారస్వత పరిషత్తు కు సారథైతివి
    ‌         "జోహారులు"
వసుధైక కుటుంబమే నా భావమంటివి
వసుధలోన మనుషులంత ఒక్కటంటివి
కులమతబేధాలను కూల్చేయమంటివి
ప్రజలంతా హాయిగా బ్రతుకాలె యంటివి
                       "జోహారులు"


కామెంట్‌లు