901) ఇంటిపేరు గుర్రాల వారు
తెలుసుకొండి బ్రదరు
కాకండి వర్రీ మీరు
ఐతే నేను బేజారు !
902) కావాలి మీ మన్ననలు
మేం కోరే విన్నపాలు
వద్దు మీకు కోపాలు
పెట్టండి ఇక దీపాలు!
903) కావాలిగ మీ సాయం
ఉండదు మాకు భయం
ఔతుంది అది అభయం
మాకిదిమో విజయం !
904) స్పందిస్తారని తెలుసు
చేయను నేను అలుసు
ఇక మీరేగా మా బాసు
అని చెప్పె మా వాసు !
905)మీ మాటను కాదనను
మీతో కలిసి వస్తాను
చేయూత మీకు ఇస్తాను
సలాం ఇక నే చేస్తాను.
906 కలవాలి మీరంతా
నిలవాలి మాచెంతా
చెప్పెను దేవాంతా
విప్పెనుగా కథంతా!
907) ఉండండి అండగా
మేమంతా నిండుగా
చేయమా పండుగా
ఉండంలే మొండిగా !
908) పార్టీ కూడా ఇస్తాము
కలరు కూడా పూస్తాము
మ్యాజిక్ షో చేస్తాము
మిమ్ముల మెప్పిస్తాము !
909) మీకు అనుమానం వద్దు
మా సందిటకొస్తే ముద్దు
పోగ్రామ్ చేయము రద్దు
హామీ ఇస్తున్నాం సిద్దు !
910) మంచి చెడు తెలిసినోళ్ళు
సహనమూ ఉన్నోళ్లు
అనుభవం కలిగనోళ్ళు
నిదానం చేసెటోళ్లు !
911) ఆలోచన చేయండి
తోడుగా ఉంటా మండి
సగం సగం మంచిదండి
సందేహం వద్దండి. !
912)అవకాశం వచ్చింది
ఆశ కూడా హెచ్చింది
ఏది నీకు నచ్చింది
చెప్పు నాకు ఇచ్చేది !
913) ఇచ్చిందే పుచ్చుకుంట
మీ ఇష్టం అని అంట
మీతో లేదు తంట
ఇక నేనిక ఉంట !
914) చేయకండి ఆలస్యం
పాటించండి రహస్యం
మానండి ఇక దాస్యం
చేయకండి అపహాస్యం !
915) పనిలో ఉన్న ఆసక్తి
మేధస్సు ధీయుక్తి
ఇచ్చు అనంతశక్తి
అప్పుడు కల్గు అనురక్తి !.
916) మీవారు బెదిరిస్తున్నరు
మమ్ముల అదిరిస్తున్నరు
సూదులు ఇస్తామన్నరు
చేయొద్దు ఫికరన్నరు !
917) చేరుకోండి మీ గోల్
కట్టండి మీ వాల్
వద్దులే సవాల్
చేస్తున్నగా కాల్ !
918) ఉన్నవిగా బదిలీలు
అందులో ఎన్నో లీలలు
కల్పించే సర్కారు కలలు
ఉద్యోగులేమో బేలలు !
919) ఇవి బదిలీల గాలులు
డబ్బు వసూల్ల వలలు
పడి లేస్తున్న అలలు
విసిరేటి సవాలులు !
920) నడుస్తున్నది గోల్మాల్
చేస్తారు ఫోన్ కాల్
తీస్తారులే దివాల్
అవుతారు అలాల్ !
921) ఒకటే డబ్బుల గల గల
అందరికి ఇవి కిలకిల
ఇంకొందరికి వల వల
మరికొందరికి గులగుల !
922) ఆఫీసుల్లో అలజడి
ఉద్యోగుల్లో ఒరవడి
ఒకరికి ఒకరు ముడిపడి
అంటించుకుంటారు తడి !
923) అక్కడ ఉన్నది ముంపు
ఇక్కడ ఉన్నది సంపు
నీవు చేయాలి జెంపు
అది నీ యొక్క తెగింపు !
924) ఆడవారి అప్పగింతలు
కడుతున్నరు గంతలు
సాగుతున్నవి ఫంతాలు
భలే ఉన్నారు ఇంతులు !
925) వాటాలు తేలుద్దాం
భాగస్తుల పిలుద్దాం
అటో ఇటో తేల్చేద్దాం
రాద్ధాంతం ముగిద్దాం !
926) కూల్చొద్దు కొంపలు
తేవద్దు తలవంపులు
కావులే అవి ఇంపులు
ఇక వేసుకో లెంపలు !
927) చెప్పడం వెరీ సింపులు
చేయకురా జెంపులు
కావద్దు తెగతెంపులు
ఐతే కల్లందింపులు !
928) జరిగిన తప్పు ఎవరిది?
చెప్పరా ఇక నా మరది
తప్పులు ఒప్పుకున్నది
ఇకపై చేయనన్నది !
929)) మెరిసింది పండు వెన్నెల
కురిసింది మన కన్నల
జాబిలి వెలిసె తోవల
వేసేద్దాంరా పూమాల !
930) జోరు జోరుగా వాన
గాలితో కలిసిన జాన
మనం ఇక సోజాన
గానం బాజా బజాన !
931) ఎగురుతున్న రామచిలుక
తరుముతున్న గోరింక
కలసి పోయేదే వంక
చెప్పవా నీవింక !
932) కరోనా అనాధలు
పడుతున్నారురా వెతలు
పత్రికల్లో వారి కథలు
వేస్తున్నారు దాతలు !
933) ఆడ ఉంది అతివృష్టి
ఈడ అనావృష్ట
ఏడ కుంభవృష్టి
ఇది దేవుని సృష్టి !
934) నీ అందం బంగారం
ఒళ్ళేమో శృంగారం
ఏమి నీ సింగారం
హృది ఆయె అంగారం !
935) విరిచిందిలే ముక్కు
చూస్తున్నది ఆ దిక్కు
ఆడోళ్ళది ఇక లక్కు
తేల్చేసింది ఆ సక్కు !
936) మేము అడిగింది ఏంటి?
మీరు చెప్పేది ఏంటి?
ఆలోచించమని అంటి
అంతలో వచ్చె బంటి !
937), అదిగద్వాల రైలుబండి
సమయానికి రాదండి
మీకు తెలియదా అండి
ఇప్పుడు తెలుసుకోండి !
938) తప్పు క్రికెట్ పిచిదా
పెట్టుకున్న వాచిదా
చెప్పేసిన కోచిదా
చెప్పు నీవు ఓ దాదా !
939) తలపెట్టకు ద్వేషం
అదిఅతి పెద్ద దోషం
వేయకు దొమ్మరి వేషం
నిలువునా నీకు విషం !
940) అవిగో చిట్టడవులు
విగో పుట్టగొడుగులు
చూసి వేయి అడుగులు
కాళ్లకేయి తొడుగులు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి