మౌన రాగం :-- కవి రత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్యపర్యవేక్షకుడు, చిట్యాల,నల్గొండ, 954223676

వినయ విధేయతల మూలం 
అప స్వరాలకు చరమ గీతం 
విభేదాల ముళ్ల మెదళ్ళకు  
ఉక్కుపాదం మౌన వ్రతం! 

మనస్సు శుద్ధి చేసే మహాయంత్రం 
శక్తి ఆదా చేసే సహజ ఇంధనం       
శాంతి కాముకుల వజ్రాయుధం 
ఏకాగ్రతా సాధనం మౌన యజ్ఞం! 

మది ఎదల మద్య సమన్వయం                                                                      
అదుపులేని భావోద్వేగాలు  నియంత్రణ
ఏ ఆలోచన లేని శూన్య నిశ్శబ్దం 
ఉన్నత ఉత్తమ భాషా నైపుణ్యం! 

అతిగా మాటల మాయతో అబాసు పాలవటం 
అబద్ధం పలికి బద్ద శత్రువవటం మాని
నాలుక చేసే మౌన దీక్ష మహోన్నతం
జీవన ప్రస్థానంలో మౌన విరామం ఓ మజిలీ! 

మనో చైతన్యంతో రోగుల స్వస్థత చేకూర్చి                                       
  యోగిని చేయు ఆధ్యాత్మిక చింతన మౌనం! 
పదునైన పరుష పదాల గుండె గాయాలకు
నివారణచర్యల నిర్మల మౌనరాగం అద్భుతం!

కామెంట్‌లు