నీలో దాగిన సృజనశక్తి వెలికి తీసే నిపుణుడు
అజ్ఞాన తామసి తరిమే విజ్ఞాన జ్యోతి స్వరూపుడు
నిష్కళంక నిష్ఠ నియమాల తోరణం గురువు
క్షరాక్షర విలక్షణ సరస్వతీ సంతానం గురువు
గురువంటే ఓవ్యక్తి కాదు అద్భుత శక్తి
సంస్కృతీ సంప్రదాయాల రథ సారథి
సద్గుణాల రాశి సమాజ మార్గ నిర్దేశకుడు
ఉన్నత వ్యక్తిత్వ ఉత్తమ జ్ఞాన సంపన్నుడు
వినయ విధేయతలు విత్తే హాలికుడు
జ్ఞాన కిరణాలు ప్రసరించే అక్షర సూరీడు
ఆలోచనాచరణల జన్మస్థానం ఆచార్యుడు
ఆత్మ విశ్వాసాల ప్రతిరూపం అధ్యాపకుడు
గురి తప్పని లక్ష్య సాధకుడు గురువు
మానవత్వం మేధస్సుల మేలి మేళవింపు
మట్టి మాణిక్యం శిల శిల్పంగా మలిచే ప్రజ్ఞాశాలి
అన్నీ ఎరుకతో అణిగి మణిగి ఉండే వినయశీలి
సహాయ సలహాల స్ఫూర్తి ప్రదాత గురువు
సమాజ చైతన్యం కాంక్షించే అక్షర శ్రమయోగి
రేపటి తరానికి మార్గనిర్దేశ జ్ఞానామృత ఫలం
ప్రభాత కిరణాలకు మురిసే తామరలా
కౌముది కర స్పర్శతో మెరిసే కలువలా
గురు శిష్యుల అనుబంధం అజరామరం
లోక మేదైనా గురువు విలువ పెరిగితేనే!
భావితరం బాగుపడేది బంగార మయ్యేది!
(5సెప్టెంబర్,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో..)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి