బాల్యం--భరద్వాజరావినూతల- కొత్తపట్నం--9866203795

చిన్నతనాన కోల్పోయాను బాల్యం
చెల్లిస్తున్నాను బ్రతుకంతా మూల్యం             
ఎంతవెచ్చించినా పొందలేను తిరిగి
చూడచక్కని తెలుగు సున్నితంబు.

అమ్మ ఒడిలో ఆడుకుంటూ
బోసి  నవ్వులతో పాకుకుంటూ
నడిపాను బాల్యం చిన్నతనాన
చూడచక్కని తెలుగు సున్నితంబు

అడిగింది సాధించుకోవాలన్న కోరిక
పగలంతా ఆటలాడి తిరిగిన  
అమ్మ పక్కలో చేరగా
చూడచక్కని తెలుగు సున్నితంబు

ముద్దులవానతో  పులకించిన మోము               
గోరుముద్దలెట్టి చందమామ చూపిస్తూ                 
అమ్మచెప్పె పాఠాలు పెద్దబాలశిక్ష
చూడచక్కని తెలుగు సున్నితంబు

కాలికి వెండి కడియం
మెడలో ఆంజనేయస్వామి బిళ్ళ
చిన్నతనాన అవే. నాఆస్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు