శాంతిమంత్రమే గొప్ప మంత్రం : భరద్వాజరావినూతల కొత్తపట్నం జిల్లా -ప్రకాశం 9866203795

 ప్రక్రియ-సున్నితం
*************************** 
విశ్వశాంతికి సేవ చేయగ 
చిన్ని అక్షరమౌదు నేను 
శాంతిస్థాపనకు అర్పించెద  నాదు మేను 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
దేశప్రగతికిఅవసరం  శాంతి 
సమైఖ్యతతోనే సాధించగల క్రాంతి 
మానవమనుగడ కారాదు బ్రాంతి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
ఐకమత్యమే మహాబలం అన్నదేసూక్తి 
చెడగొట్టారాదు దానిని కుయుక్తి 
సమైఖ్యాతారాగం అందించు  కీర్తి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
శ్వేతం శాంతికి నిదర్శనం 
ఎగరేయాలి శాంతి పావురాలు 
ఆవేశంతో వస్తాయి అనర్ధాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
బుద్ధుని శాంతిప్రవచనాలు 
అశోకుని ధర్మ సూత్రాలు 
మహాత్ముని అహింసామార్గాలు 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
కామెంట్‌లు