ఓం నమః శివాయ!! శివుడే కల్పతరువు"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098
 👌మహా లింగోద్భవుడు
     శివుడే కల్ప తరువు
       మనోభీష్టము లొసగు
            శంకర ప్రియు లార!      
🔯  శ్రీ మహా శివ లింగ మూర్తి, పరమ శివుడు .... ఆరాధకులు సాధకులు యొక్క.... ఇష్ట కామ్యార్థము లను నెరవేర్చు చున్నారు. కనుక, "సాంబ సదా శివుడే"....దేవ వృక్ష మైన "కల్ప తరువు" వంటి వారు గా; అభివర్ణించారు, మన మహర్షులు!
🔯ధ్యాన శ్లోకము:
       శ్రీమత్ గౌరీ లతాశ్లిష్టం!
      జటా పల్లవ శోభితం!
      విభు ధాభీష్ట ఫలదం!
      "శంభు కల్ప ద్రుమం" భజే!
అని, వేద వ్యాస మహర్షి, " భీమ ఖండము" నందు మహాదేవుని, శివుని.. ప్రార్థించారు.
🙏 ప్రార్థనా పద్యం (తేట గీతి )
      "పార్వతీ లత" తోడుత ప్రాకి నట్టి
       ఎర్రని జడలతో నొప్పి, ఏపు మిగిలి
        పండితో ద్దండుల కథిక ఫలము లొసగు
        పరమ "శివుడు" మనకు "కల్ప తరువు" నిజము!
          ( డాక్టర్. మీగడ రామలింగ స్వామి., )
          ఓంనమః శివాయ!

కామెంట్‌లు